Logo
Date of Publish : 27 March 2022, 4:35 pm
Editor : Sake Naresh

పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

     శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జనసేన పార్టీ అనంతపురం జిల్లా నాయకులు పెండ్యాల హరి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం గంగనపల్లి పంచాయతీ తుంపెర గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి 120మంది పెద్దలు, యువకులు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు గుండా మురళి, ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రాష్ట్రఅభివృద్ధి శూన్యంగా ఉందని రాబోయే కాలంలో జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని 2024లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల కల్పన చేపట్టి నిరుద్యోగాన్ని తగ్గిస్తామని అనంతపురం జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు వలసలను తగ్గిస్తామని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చొప్పా చంద్ర, అవుకు విజయ్, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com