పీలేరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి కామిశెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీలేరు నియోజకవర్గంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో వైసిపి పార్టీ నుండి సుమారు 100 వందమందికి పైగా వైసిపి నాయకులు మరియు యువత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మైఫోర్స్ మహేష్ కామిశెట్టి సుధాకర్ ఆధ్వర్యంలోని నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలాగే ముందు పార్టీ అభివృద్ధికి అందరూ కృషిచేసి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల విజయానికి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా సమావేశం కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, పీలేరు మండల అధ్యక్షులు మోహన్, జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, మరియు కే ఎస్ ఎస్ అధ్యక్షులు సురేష్ శంకర చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com