Logo
Date of Publish : 08 November 2021, 3:23 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోట నియోజకవర్గములో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

    కొత్తవలస, (జనస్వరం) : విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలసలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు శ్రీ టి. శివ శంకర్ గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారి సమక్షంలో పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో  YSRCP పార్టీ నుండి వందమంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ గారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వారసత్వ రాజకీయాలతోను, బానిసత్వ రాజకీయాలతోను ప్రజలు బందీలుగా ఉన్నారు. వీటిని ప్రక్షాళన చేసేందుకే జనసేన పార్టీ ఆవిర్భివించిందని పేర్కొన్నారు. అలాగే యశస్వి గారు మాట్లాడుతూ  ప్రజాసమస్యలపై జనసేన చేసే పోరాటాల దెబ్బకు వైస్సార్సీపీ దిగొస్తుంది. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో S కోట జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ వబ్బిన సత్తిబాబు గారు, శ్రీ గొరపల్లి రవికుమార్ గారు, శ్రీ గొరపల్లి చినబాబు గారు, శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారు, జిల్లా నాయకులు ఆదాడ మోహన్ రావు, త్యాడ రామకృష్ణారావు (బాలు), పార్లమెంటరీ కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, నాయకులు నక్కరాజు సతీష్, వబ్బిన సతీష్, తూరిబిల్లి విజయ్ కుమార్, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, బోని రామ గణేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com