
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్దాంతలు నచ్చి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పాలకొండ మండలంలో భాసూరు, రాజాపేట, కోటిపల్లి, లక్షంపురం గ్రామాల్లో 150 కుటుంబాలు ఒకే సారి చేరడం జరిగింది. వారందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీ లోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు. వైసిపి ప్రభుత్వము పై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.