Logo
Date of Publish : 02 April 2022, 3:27 pm
Editor : Sake Naresh

జనసైనికుల పోరాటం – రుషింగి – కిమ్మి వంతెన నిర్మాణ పనులు వేగవంతం

     రాజాం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, వంగర మండలం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు  వంగర మండలంలో పలు ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడానికి సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా రుషింగి - కిమ్మి వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న సమయంలో ఎన్ని రాజు  జనసైనికులతో చేసిన పోరాట ఫలితంగా రుషింగి గ్రామంలో వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన తేది 2-4-2022 శుక్రవారం నాడు ప్రారంభించటం జరిగింది. ఇలాంటి సమస్యకు పరిష్కారం తీసుకురావటం జనసేన పార్టీ వల్ల సాధ్యమవుతుంది అని రాజాం నియోజకవర్గం నాయకులు  ఎన్ని రాజు గారి ఆధ్వర్యంలో జనసైనికుల సహకారంతో నిరూపించటం జరిగింది. ఈ సందర్భంగా రుషింగి - కిమ్మి గ్రామస్తులు భవిష్యత్తులో రాజాం నియోజకవర్గంలో ఎన్ని రాజు  నాయకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జెండా ఎగరడం ఖాయమని తమ సంతోషాన్ని వ్యక్త పరచటం జరిగింది. ఇదే స్ఫూర్తితో రాజాం నియోజకవర్గంలో జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, స్థానిక నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com