
నెల్లిమర్ల, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలో తాళ్లపేటలో ఇల్లు దగ్ధం అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే జనసేన పార్టీ తరఫున పూసపాటిరేగ మండలం టీం తమ వంతు సాయంగా రైస్ ప్యాకెట్ లు, దుప్పట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విగారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల నాయకులు బూర్లు విజయ్ శంకర్, గుడివాడ జమ రాజు జిల్లా యువజన విభాగం నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్ మండల యువజన నాయకులు పాల్గొనడం జరిగింది.