
రాజోలు నియోజకవర్గం పడమటి పాలెం గ్రామం జనసేన నాయకులు, ఆకుల సూర్య సుబ్రహ్మణ్య గణేష్ గారు వారి కుమారుడు చి.అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు లోని వివేకానంద మనో వికాస కేంద్రం లోని దివ్యాంగుల కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 5,000/రూ. విలువ చేసే నిత్యావసరాలు అభిరామ్ తాత గారు అయిన ఆకుల వెంకటేశ్వర రావు గారి చేతుల మీదుగా అంద చేశారు. సుబ్రహ్మణ్య గణేష్ గారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఇలాంటి సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు పంచదార చినబాబు, నరేష్, గిరి మొదలైన వారు పాల్గొన్నారు.
వీరికి మనో వికాస కేంద్రం ఫౌండర్ ఎం లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.