కొత్తపేట ( జనస్వరం ) : ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామంలో బుధవారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు నిర్వహించిన జనసేనకు అవకాశం అవకాశం ఇద్దాం.. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం.. ప్రచార కార్యక్రమం అనంతరం సాయంత్రంలో మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్యనారాయణ (సత్య) ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బండారు శ్రీనివాస్ తో కలిసి మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి, టిడిపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువత ఆయా పార్టీలను వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి అహ్వనించడం జరిగింది.