గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచలం పుస్తకం అని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన గురించి తెలుసని, ఆయన కష్టార్జితం ప్రజలకు వివిధ రూపంలో సేవ చేస్తున్నారని గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మీలా తండ్రిని అడ్డం పెట్టుకొని, దోచుకోలేదని, మీలా 16 నెలలు జైల్లో ఉండలేదని, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలియక ఇలా వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడ్డం మీకే సాధ్యమని ఒక్కసారి మీ చరిత్ర కూడా గుర్తు చేసుకోండి జగన్ రెడ్డి గారు, మాకు సంస్కారం ఉందన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జగన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అత్యంత నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడితే ఎలా? అని మర్రాపు సురేష్ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి పై జగన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమన్నారు,ప్రజల కోసం పోరాటం చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? మీపై మీ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా? రాజకీయాలలో అధికారం, విపక్షం అంటూ ఉండడం సహజమేనని దానిని గౌరవ ప్రదంగా తీసుకోవాలే తప్పా ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికి వచ్చిన్నట్లు ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సిఎం జగన్ రెడ్డి గారు విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెపితే బాగుండేదన్నారు. నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి అభద్రత భావన ఉండటం వల్లనే తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు,తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు.