మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బొడిచెర్ల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది యొక్క కృంగిపోయిన బ్రిడ్జిని మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ ఈ బ్రిడ్జి మీదుగా ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉన్నందున ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించి తక్షణమే ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం పట్ల కార్యచరణ చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ షాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పిన్నెబోయిన శ్రీనివాసులు, పేరూరి రమేష్, గుండె బొమ్ము శ్రీనివాస్, యాదగిరి శివ, ఉల్లి శ్రీనివాస్ నాయుడు, కాశీరావు, గ్రందే కిషోర్, ఫణి, బెల్లంకొండ రామకృష్ణ, లక్ష్మణ్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com