మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా చదలవాడ సంఘటనలో నాగులుప్పలపాడు ఎస్ఐ మీద ప్రకాశం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకులు. అనంతరం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మీడియాతో మాట్లాడుతూ సంతనూతనపాడు నియోజకవర్గంలో నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలో డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 సమయంలో జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యుడు పమిడిముక్కల శివకృష్ణ కుటుంబ సభ్యులకు అనారోగ్యం చేయుటతో పరామర్శకు వెళ్ళిన పెండ్యాల కోటేశ్వరరావు, భూపతి మురళి మోహన్ తిరిగి వచ్చే సమయములో దగ్గర్లో గల టీ దుకాణం వద్ద టీ సేవిస్తు ఉండగా, నాగులుప్పలపాడు ఎస్ఐ శశికుమార్ వచ్చి అసభ్యంగా మాట్లాడి, విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు టీ దుకాణంలో వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడివేసి టీ దుకాణం నడిపే మహిళ మీద కూడా లాఠీ చార్జి చేసి మహిళను గాయపరిచిన సదరు ఎస్ఐ ను విధులు నుంచి తప్పించి శాఖ పరమైన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ గారిని కోరడం జరిగింది. అలా చేయని పక్షంలో రాష్ట్ర స్థాయి నాయకులతో కలసి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com