మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా, మార్కాపురం జనసేనపార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20-6-22 వ తేదీన జనసేనపార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై అర్ధరాత్రి తప్పతాగి ఫోన్ లో అనుచితంగా ప్రవర్తించిన ఒంగోలు డివిజన్ స్థాయి YCP నాయకుడి యొక్క చర్యలు హేయమైనవి అని అన్నారు. అతడిని సమర్థిస్తున్న సాటి మహిళ మేయర్ గంగాడ సుజాత తీరు అమానుషంగా ఉందని తెలిపారు. మేయర్ ఐన మీరు మీ పార్టీలో ఇటువంటి వ్యక్తులు ఉన్నందుకు సిగ్గుపడాలని అన్నారు. వెంటనే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కానీ అతని చర్యలను సమర్ధిస్తున్న తమరు తిరిగి SP కి మీరు, మీ అనుచరులు ఫిర్యాదు చేయడం స్త్రీ జాతిని మీరు అవమాన పరిచినట్లుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాయపాటి అరుణ షెడ్యూలు కావాలని అంత సరదాగా ఉంటే మేమే మీరు చెప్పిన చోటికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తామని హెచ్చరిస్తున్నాము. ఇటువంటి చర్యలు మరలా పునరావృతమైతే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళలు చూస్తూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com