మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేనపార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమముపై ముఖ్య సమావేశం జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలతో తీసుకున్న వారికి పార్టీ కార్యక్రమాల వివరాలు నేరుగా పార్టీ నుంచి అందుతాయని, పార్టీ కిట్, ప్రమాదం బారిన పడి మరణిస్తే రూ.5 లక్షల నష్టపరిహారం అందుతుందని, ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం రూ.50 వేల వరకు పరిహారం అందజేస్తారని ఇటువంటి క్రియాశీలక సభ్యత్వం రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేయడం లేదని, కార్యకర్తల భద్రత భరోసా భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com