కదిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో కదిరి టౌన్ కు చెందిన పలువురు యువకులు కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ పట్ల, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర బాగు కోసం చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని పలువురు యువకులు పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం అని, అలాగే ఈ ముఖ్యమంత్రి గారు పలు అబద్ధాలతో యువత కు ఉద్యోగాలు కల్పిస్తానని అధికారంలోకి వచ్చి ఆ మాటే మరిచిపోవడం, ఈరోజు చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వలసల పోతుండడం చూస్తున్నామని ఇలాంటి పరిస్థితి మారాలంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన పగ్గాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ యువత కోరుకుంటుంది అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువత పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అని తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో సుహాయల్ ఖాన్, ముజీబ్, మురళి, శ్రీనివాసులు నాయక్, నగేష్, హర్షవర్ధన్ తదితర 20 మంది యువకులు పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షులు చలపతి, కుటలా లక్ష్మణ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.