తాడేపల్లిగూడెం, మార్చి 18 (జనస్వరం) : తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం పడమర విప్పర్రు వడ్డి గూడెం నుండి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, జనసేన- తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజా సేవ గుణానికి ఆకర్షితులైన విప్పర్రు వడ్డిగూడెం ప్రజలు భారీగా వచ్చి నాగ సత్యనారాయణ, చెన్న రాంబాబు ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్డిగూడెం ప్రాంతంలో ఎన్నో సమస్యలును ఉన్నాయని ఆ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేస్తానని మేమున్నంటే నడుస్తానని పార్టీలో జాయిన్ అయినా వడ్డిగూడెం ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బలే చక్రవర్తి, గణశల శ్రీను,బలే షాలీం, బలే తేజ, గణశల రాజేష్, మనోహర్,శేఖర్,మని,నరేంద్ర, బలే నరేంద్ర, ప్రదీప్, లక్షన్ తదితరులు పార్టీలో చేరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com