Logo
Date of Publish : 27 May 2023, 5:57 pm
Editor : Sake Naresh

టి.సి వరుణ్ ఆధ్వర్యంలో పలువురు జనసేనలోకి చేరిక

         అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలోకి పలువురు చేరారు. శుక్రవారం జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్  టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో నగరంలోని 48వ డివిజన్ కు చెందిన పలువురు స్వచ్ఛందంగా పార్టీలోకి చేరారు. వీరికి టీ.సీ.వరుణ్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ... జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు  టీ.సీ.వరుణ్ గారు మాట్లాడుతూ... జనసేన పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కష్టపడే ప్రతి ఒక్కరిని అధిష్టానం గుర్తించి వారికి సరైన సమయంలో మెరుగైన అవకాశాలు కల్పిస్తుందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బాటలో పయనించి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టాలన్నారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉండాలని పార్టీ పటిష్టతకు మీరు చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో  రామాంజనేయులు,  సాయి దేవ్, జయవర్ధన్, వంశి, యోగి, షెక్షావలి, బాలాజీ రాజ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి అవుకు విజయకుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com