చంద్రగిరి, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యర్రావారిపాళెం మండలం, ఉదయమాణిక్యం పంచాయితీ పరిధిలోని కోరువాండ్ల పల్లెలో పార్టీ జిల్లా కార్యదర్శి దేవరా మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేద రైతులకు వ్యవసాయ సామాగ్రి, వాటర్ ట్యాంకర్ అందచేశారు. అనంతరం ఉదయమాణిక్యం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మురళీ ఆధ్వర్యంలో ఎరుకలపల్లికి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. దేవర మనోహర్ వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రగిరి నియోజకవర్గంలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని ఈ సందర్భంగా మనోహర్ దేవరా స్పష్టం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com