
పాయకరావుపేట (జనస్వరం): పాయకరావుపేట మండలం గుంటుపల్లి గెడ్డం బుజ్జి ఇంటి వద్ద నక్కపల్లి మండలం అమలాపురం గ్రామపంచాయతీ చెందిన మత్స్యకారి యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వైసిపి, టిడిపి పార్టీ నుంచి సుమారు 15 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి మాట్లాడుతూ పార్టీ లో చేరిన కార్యకర్తలను అభినందించారు. వారికి ఏవిధమైన సహాయం కావలసి నిరంతరం అందుబాటులో ఉంటు అండగా ఉంటానని వారికి బుజ్జి భరోసా ఇచ్చారు.