Logo
Date of Publish : 25 June 2022, 11:31 am
Editor : Sake Naresh

శింగనమల నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి పలువురు ముస్లిం మైనారిటీలు చేరిక

    అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ మహిళ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి ఆధ్వర్యంలో పెండ్యాల శ్రీలత అధ్యక్షతన ఇతర పార్టీల నుంచి శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం లోని రామిరెడ్డి కాలనీకి చెందిన పలువురు ముస్లిం మైనారిటీలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దుల్హన్ పథకం, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం, ఇస్లామిక్ బ్యాంకులు, ఇమామ్ లకు మౌజాలకు ప్రత్యేక గృహాల ఏర్పాటు వంటి అనేక హామీలకు తూట్లు పొడిచి మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అందువల్ల మాకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోను జనసేన పార్టీతోనే మాకు సచార్ కమిటీల ద్వారా సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి జనసేన పార్టీలో చేరడం జరిగిందని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపనకు, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, సభాధ్యక్షులురాలు కాశెట్టి సావిత్రి , కార్యదర్శి జక్కిరెడ్డి పద్మావతి, వీర మహిళలు శిల్పా, కుమారి రూపా, కుళ్ళాయమ్మ, నాయకులు తోట ప్రకాష్, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, సోము, సాయి కుమార్, చంద్ర, మహేంద్ర, కిరణ్, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com