Logo
Date of Publish : 26 August 2022, 3:13 am
Editor : Sake Naresh

చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి పలువురు మైనార్టీలు చేరిక

     ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 26 వ వార్డ్ యర్రగుంటకు చెందిన మైనారిటీ, వివిధ కులాలకు సంబంధించి 50 కుటుంబాల వారు చేరడం జరిగింది. దేవిశెట్టి విజయకుమార్, నరగోని నరేష్, షేక్ ముజాహిద్, షేక్ అక్బర్, షేక్ షేక్షావలి, షేక్ అజుమ్,షేక్ సాదిక్, సయ్యద్ షేక్ష, ముహిద్, పెన్నబడి అమర్నాథ్, సాకే పార్తు, కాసే అనిల్ కుమార్, ఆచారి వెంకటేష్, కృష్ణ కాంత్, పలమ్ నేటి కిట్టు, వడ్డే సుబ్బరాజు, బోయ గంగాధర్, ఓం ప్రకాష్, గణేష్ మొదలగున వారు పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com