
ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పొందూరు మండలం అన్నంపేటలో నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు జనసేన జెండావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అనంతరం దాదాపు 38 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అధికార పార్టీ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్ట వేయబడిందని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఈ అవినీతి పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి కల్పింస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొందూరు జడ్పీటీసీ ఆసిరినాయుడు, ఎచెర్ల నియోజకవర్గ నాయకులు అర్జునభూపతి, చిన్నం నాయుడు, Y.రమణ, అప్పలనాయుడు, గణేష్, బాబురావు, శివ, సంతోష్, మనోజ్, సురేష్, సింహాద్రి, రమేష్, లక్ష్మినారాయణ, B.రమణ, రమణ, లక్ష్మణ్, సూరి, అప్పలనాయుడు, రాంలక్ష్మణ్, రఘు, జనసైనికులు పాల్గొన్నారు.