
ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం లింగారెడ్డి పల్లి గ్రామం నుండి వలకొండ రవి, కపాడం కాటమయ్య, అర్వేటి ఓం ప్రకాష్, అన్నం శ్రీకాంత్, మేకల నాగ భూషణ, శివానంద, కపాడం రవి, 10 కుటుంబాలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి మండల కన్వీనర్ పుర్రం శెట్టి రవి, తాడిమర్రి మండల కన్వీనర్ కొండ్ర చంద్రబాబు నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, దాడితోట కృష్ణయ్య, ఇండ్ల రామాంజనేయులు, కోటికి రామంజి, పేరూరు శ్రీనివాసులు, సీన తదితరులు పాల్గొన్నారు.