Logo
Date of Publish : 07 October 2021, 5:13 pm
Editor : Sake Naresh

జగ్గంపేట మండలంలో వైకాపా నుండి జనసేన పార్టీలోకి పలువురి చేరిక

     జగ్గంపేట, (జనస్వరం) : మండలంలోని గోవిందపురం గ్రామంలో మంగళవారం వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు యువకులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ పాటంశెట్టి సురేష్‌ చంద్ర వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. వార్డ్‌ మెంబర్‌ గంపాన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జనసేన వనసంరక్షణ పేరుతో లక్ష నిమ్మ మొక్కలు పంపిణీ లక్ష్యంగా సూర్యచంద్ర తలపెట్టిన మొక్కల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికీ 77 ,800 మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వివిధ గ్రామాలలో మొక్కల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసైనికులు ఉత్సాహంగా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన మండల అధ్యక్షులు పాలిశెట్టి సతీష్‌, కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండలాల అధ్యక్షులు పులిసి అయిరాజ్‌, గోన శివరామకృష్ణ ఉంగరాల మణిరత్నంల ఆధ్వర్యంలో గోవింద పురానికి చెందిన తుమ్మల ఫణీంద్ర, స్వామి, మనోజ్‌, సతీష్‌, సమ్మెటప్రసాద్‌, కొల్లి వీరబాబు, పలు కుటుంబాల సమేతంగా జనసేనలో చేరారు. నియోజకవర్గ నాయకులు గుత్తుల గంగాధర్‌, అల్లం శ్రీనివాస్‌, మొగిలి గంగాధర్‌, బీడీల రాజుబాబు, శ్రీను, దుర్గాప్రసాద్‌ ఆదినారాయణ పలువురు నాయకులు, కార్యకర్తలు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com