
అచ్యుతాపురం, (జనస్వరం) : అచ్యుతాపురం మండలంలోని సెజ్ కాలనీ మోటూరు వానిపాలెం గ్రామం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు నచ్చి అదే విధంగా ప్రజల కోసం నిలబడి ప్రభుత్వాని ధైర్యంగా ప్రశ్నించే రాష్ట్ర అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంపై భరోసాతో ఆయన సమక్షంలో వైయస్సార్సీపి మరియు టిడిపి పార్టీకి చెందిన సుమారు 80 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన అచ్యుతాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కోరుకొండ ప్రసాద్, సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాష్, కంఠం రెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.