Logo
Date of Publish : 02 March 2021, 4:10 pm
Editor : Sake Naresh

ఏకగ్రీవాల కోసం ఎన్నెన్నో అక్రమాలు : జనసేన నాయకులు చిలకం మధుసూధన్ రెడ్డి

            ఏకగ్రీవాల కోసం అధికారపార్టీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ నాయకులు, ధర్మవరం జనసేన నాయకులు చిలక0 మధుసూధనరెడ్డి వాపోయారు. తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నిక జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు అనేక  విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నామినేషన్ల, ఉపసంహరించకోకపోతే ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని బెదరించడం. పాటు పోలీసు కేసులతో హింసకు గురిచేయడం, అభ్యర్థుల కుటుంబ సభ్యులను భయా౦దోళనలకు గురిచేయడం పాటు ప్రత్యర్థుల ఆచూకీ లేకుండా గల్లంతు చేయడంలాంటి దుశ్యర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులైన 30వ వార్డు అభ్యర్థి వెంకటమ్మ ఆచూకీలేకుండా చేశారని, గత కొన్ని రోజులుగా ఆమె కనపడకుండా పోయారని వాపోయారు. 28వ వార్డు అభ్యర్థి పార్వతమ్మను నామినేషన్‌ వేసిన వెంటనే బలవంతంగా వైసిపి కండువా కప్పారని, అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేసీ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారని ఆరోపించారు. తమపార్టీ మరో అభ్యర్థి చిన్నా ఇంటి వద్దకు అధికారపార్టీ అభ్యర్థి వెళ్ళి నామినేషన్‌ ఉపసంహరణ పత్రంలో సంతకం చేయాలని దౌర్జన్యం చేయడం సమంజనమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక రోజులోపల కనిపించకుండాపోయిన వారి ఆచూకీ తేలకపోతే జిల్లా ఎస్పీతో  పాటు తమ పార్టీ అధినేత వపన్‌ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకుంటామని ఆయన బరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో నామినేషన్లు అయిన తరువాత ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే అందుకు విరుద్దంగా అధికారపార్టీ నాయకులు అప్రజాస్వామికంగా ప్రతివక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను దౌర్దన్యాలతో ఆందోళనలకు గురిచేసి హింసిస్తూ, నామినేషన్ల ఉపసంహరణకు వత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1993-1994లో ధర్మవరంలో జరిగిన అరాచకాలను తిరిగి ఇప్పుడు సృష్టిస్తున్నారన్నారు. నాడు బాంబులతో శబ్దాలు వినిపించేవని, నేడు నిశ్శబ్దంగా అంతర్గతంగా ప్రత్యర్థుల కుటుంబాలను ఇబ్బందుల పాలుచేస్తూ బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణకు వత్తిడి తెస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలవ వచ్చని, అయితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదరించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా అకృత్యాలు చేయడం సబబు కాదన్నారు. సాయం చేసిన నేత కుటుంబానికి సున్నం పెట్టిన చరిత్ర కలిగిన నేత మాటలు వినవద్దని ఆయన వైసిపి నాయకులు, కార్యకర్తలకు హితవుపలికారు. కాలం ఒకేలా ఉండదని మీ నేత మిమ్ములను కూడా కాలానికి వదిలేసి వెళ్లిపోతారని, అప్పుడు మిమ్ములను ఇబ్బందులు చుట్టుముడతాయన్న విషయం గ్రహించాలని ఆయన హెచ్చరించారు. తా ము చేతులు ముడుకోలేదని, ప్రజాస్వామికంగా పోరాడాలని భావించామే కానీ చేతులకు గాజులు తొడుక్కోలేదని ఆయన సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో అశాంతి రేపాలని చూస్తే తగిన ఫలితం అనుభవిస్తారన్నారు. గతంలో ధర్మవరంలో దౌర్జన్యాలు చేసిన వారి చరిత్రలు ఏమయ్యాయో గ్రహించాలని ఆయన గుర్తుచేశారు. ధర్మవరం మున్సిపల్‌ చైర్మన్‌ ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతా మని, ధర్మవరం కోటలో జనసేన జండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అడ్డగిరి శ్యాంతో పాటు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com