మంత్రాలయం ( జనస్వరం ) : మంత్రాలయం మండల జనసేనపార్టీ నాయకుడు ఏసేపు రచ్చమరి గ్రామం లో వైయస్సార్ కాలనీని వర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాలనీ గృహ నిర్మాణంలు స్టార్ట్ చేయడం జరిగిందని అన్నారు. అక్కడ ఆ గృహ నిర్మాణాలు ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా మట్టిపై 8 ఇంచెస్ కాంక్రీట్ వేస్తున్నారు. అక్కడ కాలనీలో ఖాళీ ట్రాక్టర్ పోతేనే మట్టిలో కూరుకుపోయే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలు కింద ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా ప్లాట్ ఎలా ఉంటే అలా ఏమాత్రం లెవెల్ లేకుండా బురద మట్టిలో ఇల్లులు కట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వం కట్టిన ఇంట్లో నిర్మాణాలు ప్రజల కోసం కడుతున్నారో తెలియదు. పేర్ల కోసం కడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com