- యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి – గోపీనాథ్
కదిరి రూరల్, మార్చి 29 (జనస్వరం) : సత్యసాయి జిల్లాలోని కదిరి రూరల్ మండలం కాలసముద్రం గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన “మన్ కీ బాత్” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రధాన మంత్రి సందేశాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రామాంజనేయ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. “మన్ కీ బాత్” కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి దేశ ప్రజలతో నేరుగా మాట్లాడటం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ భావనను పెంపొందించడమే కాకుండా, సమాజం పట్ల బాధ్యతను కూడా గుర్తుచేస్తుందని తెలిపారు. అలాగే విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా దేశ సేవలో భాగస్వాములు కావాలని, మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత ముందుండాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి సందేశాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తలుపుల రామంజులు, కదిరి రూరల్ మండల అధ్యక్షుడు ఎర్రంశెట్టి రమేష్ బాబు, కదిరి పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఆనంద్, జిల్లా మాజీ కార్యదర్శి అశోక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కద్దర్ వెంకటరమణ, ముచ్చుకోట్ల గోవర్ధన్, హరీష్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జయరాములు, బీజేవైఎం అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
