
రాయదుర్గం ( జనస్వరం ) : ఈనెల 14 వ తారీకున బొమ్మనహాళ్ మండలంలోని బలుగుడ్డం చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చాకలి బజప్ప గుండెపోటుతో మృతిచెందడం జరిగింది. ఈరోజు బొమ్మనహాళ్ మండలం పర్యటనలో బొజ్జప్ప ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించిన రాయదుర్గం జనసేన ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసైనికులకు అండగా జనసేనపార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.