పేదవాడి ఇంటి స్థలం అర్హుల జాబితాలో అవకతవకలు : రాజన్న వీర సూర్య చంద్ర
నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా ఇంటి స్థలం ఎంపిక జాబితా లో అవకతవకలు జరిగాయయని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఆరోపించారు. వాలంటీర్స్ ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. కానీ, సచివాలయంలో వచ్చిన ధరఖాస్తులను వైసీపీ పార్టీ అధికార నాయకులు తమకు అనూకూలమైన వారివే పై అధికారులకు పంపిస్తున్నారు. కనీసం పదుల సంఖ్యలో కూడా ఏ సచివాలయంలో కూడా ప్రదర్శించిన పాపాన పోలేదు. అక్కడ సచివాలయ అధికారులను అడిగితే సంబంధిత విఆర్ఓ ని అడగండి అని వీఆర్వో ని అడిగితే కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయండి. త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయి జాబితా చూపించడం లేదు. వీటిపై సంబంధిత నాలుగు మండలాలు ఎమ్మార్వో అడిగితే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వి ఆర్ వో ల వద్ద లిస్టు ఉందండి సరి చూసుకోండి అని చెప్తున్నారు. ఏ ఒక్క అధికారి సమాధానం చెప్పలేని పరిస్థితి. సరే అని పేద ప్రజలు వైసీపీ అధికారంలో ఉంది కదా స్థానిక నాయకులు ఇంటి వద్దకు వెళితే నేను పేద వాడిని బాబు నాకు ఇంటి స్థలం ఇప్పించండి అని వేడుకుంటే నువ్వు ఎంత ఇచ్చుకో గలవు ? అని పేదవాడిని అడుగుతున్న పరిస్థితి!! ఈ సమస్యపై ప్రతి గ్రామంలో కూడా పేదవారు జనసేన దృష్టికి తీసుకు వస్తే పేదవాడి ఇంటి స్థలం పై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చూస్తే కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ చూడం అని చెబుతున్నారు. కానీ క్రింది స్థాయిలో చూస్తే కేవలం వైసీపీ సానుభూతిపరులు అది కూడా గట్టిగా ఒత్తిడి చేసే వారి వైసిపి పెద్దల తాలూకా మనుషులకే పేదల ఇంటి స్థలాల జాబితాలో పేరు ఉంటుందని పేదవాడికి అర్హత ఉన్నా సరే అప్లికేషన్ పెట్టినా సరే మాకు మంజూరు చేయలేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నిజమైన అర్హత కలిగిన రాజకీయాలకు తావులేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చే ప్రయత్నం చేయాలని లేనిపక్షంలో జనసేన మరియు బిజెపి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్హుల జాబితా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు voodi చక్రవర్తి, నర్సీపట్నం పట్టణ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం పట్టణం ప్రధాన కార్యదర్శి కొప్పాక కళ్యాణ్ , నర్సీపట్నం గ్రామీణ నాయకులు ఎర్ర ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com