Logo
Date of Publish : 07 June 2026, 6:52 pm
Editor : Sake Naresh

భగీరథ జయంతి వేడుకల్లో పాల్గొన్న మణిప్రియ దళవటం

పరిగి, జూన్ 7, (జనస్వరం) : శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని శీగుపల్లి గ్రామంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఆదివారం గ్రామస్థులు, సగర (ఉప్పర) సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర సగర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ దళవటం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మణిప్రియ దళవటం మాట్లాడుతూ, గంగానదిని భువికి తీసుకురావడానికి భగీరథుడు చేసిన తపస్సు, పట్టుదల మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. భగీరథుని వారసులైన సగర (ఉప్పర) కులబాంధవులు విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉప్పర సగర సామాజిక వర్గ సంక్షేమం, ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వర్గానికి సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సగర చైర్మన్ వెంకటరమణ, లైవ్‌స్టాక్ డైరెక్టర్ ఈజీ వెంకటేష్, రొడ్డం మాజీ ఎంపీపీ నరసింహ, షణ్ముఖ ఉప్పర్, గ్రామ ప్రముఖులు, సగర సంఘం నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com