
గుంతకల్లు, (జనస్వరం) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామం జనసైనికుడు షాషావలి గారిని స్థానిక గుంతకల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, మరియు జనసేన పార్టీ గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, జనసేన నాయకులు, కార్యకర్తలు వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడికి మనోధైర్యాన్నిచ్చి జనసేనపార్టీ మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.