గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్లు పట్టణం వాల్మీకి నగర్ లో అత్యంత ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు మరియు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్లు ఇంటి పైన వెళుతున్నాయి వాటిని సురక్షితంగా పక్కకు మార్చాలని ADE గారికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ ADE తో మాట్లాడుతూ గుంతకల్ పట్టణం ఎస్ఎన్ పేట్, వాల్మీకి నగర్ జనావాసం ఎక్కువగా ఉండే ప్రాంతము నందు కరెంటు స్తంభాలు ఒకవైపుకు ఒరిగి, ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్ లు ఇంటి పైనుండే వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారి ప్రాణనష్టం కలిగించే విధంగా ఉన్నాయి. మహిళలు, చిన్నపిల్లలు ప్రమాదకరంగా మారిన కరెంటు స్తంభాలు, వైర్ల వల్ల వారి ఇంటిపై కూడా వెళ్లడానికి వీలులేకుండా పోయింది. గతంలో ఆ సర్వీస్ వైర్లను మార్చడానికి మీ ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది కొన్ని కొత్త కరెంటు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ఎలక్ట్రికల్ వైర్లను సురక్షితంగా కొత్త స్తంభాలపై మార్చడానికి చాలా నెలలుగా అలసత్వం జరుగుతుంది కావున ఆ కాలనీవాసులపై దయవుంచి వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మండలం జనసేన పార్టీ పార్టీ అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వ వార్డు ఇంఛార్జ్ బండి శేఖర్, S. కృష్ణ, పాండు కుమార్, రమేష్ రాజ్, ఆటో రామకృష్ణ, సంసన్ రాజ్, ప్రకాష్ నిస్వార్థ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.