మంగళగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కి సంబంధించిన చలో మచిలీపట్నం పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, ఈ సభలో జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగిందని, భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని పేర్కొన్నారు.ఈ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ ద్వారా దిశా నిర్దేశం చెయ్యనున్నారని, భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి మచిలీపట్నం సభా ప్రాంగణముకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార రథం వారాహితో వేలాది మంది బైక్ ర్యాలీతో సభా ప్రాంగణం కు చేరుకుంటారు. అలాగే, రాబోయే ఎన్నికలకు మానిఫెస్టో ఎలా ఉండాలి అని ఆవిర్భావ దినోత్సవ సభ కంటే ముందే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అన్ని కమ్యూనిటీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకొని, మన పార్టీ అధికారంలోకి వచ్చినాక మనమేం చేయాలి అన్నదానిమీద జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించనున్నారని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com