మండపేట, (జనస్వరం) : మండపేట – ద్వారాపూడి రోడ్డు నిర్మాణం జరిగే వరకూ ప్రజా ఉద్యమం కొనసాగుతూనే వుంటుందని మండపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు కుంచె ప్రసాద్ పేర్కొన్నారు. మండపేట – ద్వారపూడి రోడ్డును అధికారులు తక్షణమే నిర్మించాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి రెండోవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టడంలేదని విమర్శించారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా రోడ్డు కోసం పోరాడుతూనే ఉన్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదన్నారు. స్పందించే వరకూ అనునిత్యం తాము పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. రెండవ రోజు దీక్షల్లో ప్రసాద్ తో పాటు ch. నాని, వల్లూరి సత్య ప్రసాద్, పెనుమాకుల రాజు, పచ్ఛిమళ్ల గంగరాజు, పలివేల శ్రీనివాస్, గుత్తుల పద్మావతి, ఎస్.శ్రీను, తిరుసూల బాసి, రిమ్మలపూడి చిన్న, ఒలిపల్లి చిన్న, ఓలిపల్లి రాజు, సంకరాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.