
రాజమండ్రి ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేయాలని రాయవరం మండలం JAC కమిటీ ఆధ్వర్యంలో రాయవరం మండల కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ తూర్పు గోదవరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు దీక్ష శిబిరాన్ని సందర్శించి పూర్తి మద్దతు గా ఉంటామని స్పష్టం చేశారు. చెల్లూరు జనసేన పార్టీ తరుపున వల్లూరి సత్య ప్రసాద్, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియజేశారు.