Logo
Date of Publish : 13 January 2024, 9:32 pm
Editor : Sake Naresh

నెల్లూరులో మన ఊరు మన ఆట కార్యక్రమం

   నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీలో విఆర్సి గ్రౌండ్ నందు మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో భాగంగా శనివారం జన సేన పార్టీ వీర మహిళలు ముగ్గుల పోటీ నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. అంతే కాకుండా పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయాలను, సంస్కృతులను కాపాడడం అనేది జనసేన పార్టీ ముఖ్యమైన ఏడు సిద్ధాంతాల్లో ఒకటి. సంక్రాంతి పండుగంటేనే శతకోటి వేడుకలు వాటిని స్పురింప చేస్తూ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు సిటీ నిర్దేశికులు వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ రోజు ముగ్గుల పోటీ నిర్వహించిన వీర మహిళలకు శుభాభినందనలు తెలియజేశారు. పనికిమాలిన పీడలను పనికిరాని పార్టీలను, నాయకులను భోగి లో తోసి కొత్త శోభతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ కొత్త నాయకులను ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించ వలసిందిగా కోరుకుంటు ఉన్నాము. స్వచ్ఛందంగా ముగ్గుల పోటీకు కలిసి వచ్చిన మహిళలకు అలాగే చాలా చక్కగా దీన్ని నిర్వహించిన వీర మహిళలకు పేరుపేరునా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి మిక్సీ,తృతీయ బహుమతి గ్యాస్ స్టవ్, తృతీయ బహుమతులు కుక్కర్ ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సతీమణి గునుకుల విజయలక్ష్మి, జనసేన వీర మహిళలు నగరం హైమావతి, కృష్ణవేణి, హసీనా, ప్రవల్లిక, సుజా,సుభాషిని జనసేన సీనియర్ నాయకులు ఏటూరు రవికుమార్, కృష్ణారెడ్డి, హరి రెడ్డి, ఈగి సురేష్, కాకు మురళి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com