విజయవాడ ( జనస్వరం ) : 56 వ డివిజన్ అధ్యక్షులు పిళ్ళా వంశి, ప్రియు డివిజన్ సమన్వయకర్తలు దాసిన జగదీష్ మాచర్ల పవన్ కళ్యాణ్, సయ్యద్ షాహినా హుస్సేన్ ఆధ్వర్యంలో 63 వ రోజు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి పోతీన మహేష్ 56వ డివిజన్ లోని పాత రాజరాజేశ్వరి పేట జెండా చెట్టు సెంటర్ వద్ద నుంచి మొదలుపెట్టి సచివాలయం రోడ్డు, మసీద్ రోడ్, తదితర ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల సమయంలో కనిపించారు కానీ ఇప్పటివరకు కనిపించలేదని మా సమస్యలు చెప్పుకుందాం ఇక్కడ కార్పొరేటర్ కనబడడం లేదని, రోడ్లు సరిగా లేవని, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, మంచినీరు రంగు మారి వస్తుందని అన్నారు. డ్రైనేజీల పారుదల సరిగా లేదని దోమలు బెడద ఎక్కువగా ఉందని సాయంత్రం అయితే పది నిమిషాలు కూడా బయట నిలబడే పరిస్థితి లేదని ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉండవలసిన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ప్రజలందరూ కూడా మాకు తెలియజేశారని అన్నారు. మరి కొంతమంది సెంటు భూమి పథకం కింద మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు వలన మాకు ఉపయోగం లేదని ఆ కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని మమ్మల్ని మోసం చేయడానికే ఈ సెంటు భూమి పథకం పెట్టారే తప్ప పేదల సొంతింటి కల నెరవేర్చడానికి మాత్రం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్ గారిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని అన్నారు. ఇప్పటికి ఇసుక లభ్యం కావడం లేదని దీనివలన పనులు దొరకడం లేదని వారంలో రెండు రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నాయని పనులు దొరకక కొన్ని రోజులు పస్తులు ఉండాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రభుత్వంనకు రోజులు దగ్గిర పడినాయని జనసేన టిడిపి ప్రభుత్వానికి బంపర్ మెజారిటీతో అధికారంలోకి తీసుకొస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 56 వ డివిజన్ అధ్యక్షులు పిళ్ళా వంశి, ప్రియు డివిజన్ సమన్వయకర్తలు దాసిన జగదీష్ మాచర్ల పవన్ కళ్యాణ్, సయ్యద్ షాహినా, హుస్సేన్, వెంకటేష్, లీలా రావ్ నవీన్, కొరగంజి వెంకటరమణ, మల్లిపు విజయలక్ష్మి ఏలూరు సాయి శరత్, రాము గుప్తా ఆకుల రవి శంకర్, నాంచారయ్య, పాలేటి మోహన్ రావు, బోట్ట సాయి పులి చేరి రమేష్, బేవర లోకేష్ తదితరులు పాల్గొన్నారు.