విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 17వ రోజు 35వ డివిజన్ అధ్యక్షులు NS ప్రదీప్ రాజ్ గారి ఆధ్వర్యంలో పూర్ణానంద పేట, చాంద్ కళ్యాణ మండపం మహమ్మద్ బేగ్ స్ట్రీట్ వద్ద నుండి వద్దనుండి ప్రారంభించి 35వ డివిజన్ లో పలు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 35 డివిజన్లోని చాంద్ కళ్యాణ మండపం, సంజీవరావు వీధి మరియు పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని, పర్యటనలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి అనేక పోరాటాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందని, ముఖ్యంగా ఇసుక పాలసీ మార్చాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం గురించి గానీ, రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలని ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని ఇది రాష్ట్రాన్ని కొల్లగట్టాలనే కుట్రనే అంశం మీద మరియు కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆర్థిక సాయం, యువతకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే మొదలగు అంశాలను ప్రజలకు తెలియజేయడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని, నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని, చెత్త పై పన్ను వసూలు చేస్తున్నారని, ఇటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదని ఇటువంటి పనికిమాలిన వ్యక్తి మాకు అవసరం లేదని ఈసారి మేము పవన్ కళ్యాణ్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు అని, స్థానిక కార్పొరేటర్‌కు తమ సమస్యలు చెప్పుకుందాము అనుకుంటే అందుబాటులో ఉండటం లేదని, క్యాన్సర్ పేషంటు ఆర్థిక సాయం కోసం కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే కనీస స్పందన కూడా లేదని, కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండరని, ప్రజా సమస్యలు పట్టించుకోనటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారని, నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం చేసే స్థాయిలో జనసేన నాయకులు అందుబాటులో ఉన్నారని, స్థానిక ప్రజలు చెప్తున్నారు అని రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీనే గెలవాలని, ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
డివిజన్ అధ్యక్షులు NS ప్రదీప్ రాజ్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి పోతిన వెంకట మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాంద్ కళ్యాణమండపం, సంజీవరావు వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసు కోవడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను తెలియజేస్తున్నారని అదే విధంగా వారి సమస్యను కూడా చెప్పుకోవడం జరిగిందని వాటిని నోట్ చేసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు 35వ డివిజన్ లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రెండు వారాలుగా డివిజన్లో పర్యటించడం జరిగిందని ఆయా ఆయా డివిజన్లోని సమస్యలను గత సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ,స్పందనా లో పెట్టినటువంటి ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని అలాగే మేయర్ గారికి కొన్ని సమస్యలను వివరించడం జరిగిందని మేయర్ గారు ఆ సమస్యలను చూస్తానని చెప్పడం జరిగిందని చూస్తానంటే కుదరదు అని ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మేయర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని డివిజన్లో పర్యటించి డివిజన్ సంబంధించిన సమస్యలను స్పందన లో ఫిర్యాదు చేస్తామని అలాగే స్పందనలో ఫిర్యాదు చేసినటువంటి ప్రతి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కూడా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సుమన్ నాయక్, నవీన్ రాజ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, ,కొరగంజి వెంకటరమణ, ,బొమ్ము రాంబాబు , సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు సాయి శరత్, రెడ్డిపల్లి గంగాధర్, స్టాలిన్ శంకర్, పొట్ట సాయికుమార్, పిలిచేరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com