సూళ్లూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం కాదలూరు పంచాయితీ కట్టవ గ్రామంలో సుమారు 190 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్ మరియు పులి రత్న కుమార్ ఆధ్వర్యంలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ స్థానిక సమస్యలను ప్రజలను నేరుగా అడగగా డ్రైనేజ్ సిస్టమ్ , కొన్ని అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది, అలాగే జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తడ మండల ప్రధాన కార్యదర్శి చేని ముని శేఖర్, స్థానిక జనసైనికులు తొండ బాబు,పులి తరుణ్,గుమ్ముడిపుడి కిరణ్, యర్రబత్తి శేషయ్య,వేలూరు చిన్నరాజ, పులి తరుణ్, పులి ఉమ,పులి లీలాకృష్ణ, పులి బబ్లూ, పులి నికేష్, డమ్మయి మస్తాన్, పులి చిరంజీవి, పులి రవి పాల్గొని పవనన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com