సూళ్లూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట మండలం SHAR పరిసర ప్రాంతంమైన ధామరాయి పంచాయితీలోని కొల్లపట్టు గ్రామంలో సుమారు 300 కుటుంబాలను జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్ గారి నాయకత్వంలో స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలి అన్న దృక్పథంతో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్_కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా స్పందిస్తూ మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఓట్లకు వినియోగించుకుంటున్నారే కానీ మా సమస్యలు పరిష్కరించే నాయకులే లేరు అని నిరసన వ్యక్తపరిచారు. మాకు ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్న రోడ్డు సమస్యను మరియు నీటి సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన నాయకుడు సోమశేఖర్ కు విన్నవించారు. జనసేన ఖచ్చితంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని, అవసరమైతే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అసమర్థతను ఎండగడుతూ 12 గ్రామాలకు వెళ్లే రోడ్డు కోసం బలమైన పోరాటం చేస్తాం అని సోమశేఖర్ హామీ ఇచ్చారు. మా గ్రామాలకు దశాబ్దాల కాలంలో అనేక పర్యాయాలు వచ్చిన ఏకైక నాయకుడు రోసనూరు సోమశేఖర్ మాత్రమే అని జనసైనికులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, ముని రాజ, తిరుపాల్, కిరణ్, మహేష్, కిషోర్, వెంకటేష్, మురళి, గోపాల్, చంటి, రవి, అఖిల్, నాగార్జున, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ అన్న రావాలి పాలన మారాలి అంటూ జన సైనికులు నినాదాలు చేశారు.