
సూళ్లూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట మండలం ఇలుపూరు మేజర్ పంచాయితీ లోని సుమారు 370 పైగా కుటుంబాలను జనసేన యువనేత రోసనూర సోమశేఖర్ గారి నాయకత్వంలో స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేయాలన్నారు. 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యాల్లంపాటి రిషి, వెంకయ్య, సుబ్బు, ఆనంద్, రమేష్, శ్రీను, మహేష్, వెంకటేష్, దశయ్య , దయాకర్, సోము, రాఘవయ్య, మాతయ్య తదితరులు పాల్గొన్నారు.