
సూళ్లూరుపేట, (జనస్వరం) : సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట మండలం ఇలుపూరు పంచాయతీలోని కొన్నెంబట్టు, ఇలుపూరు గ్రామాల్లోని సుమారు 300 పైగా కుటుంబాలను జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలని జనసేనపార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అజిత్, అశోక్, పవన్ కుమార్, ఆనంద్, రాఘవ, పండు, కాటయ్య, ఊరి పెద్ద బత్తెయ్య, వెంకటయ్య, వెంకయ్య, సుబ్బు, సుధాకర్ & టీమ్ తదితరులు పాల్గొన్నారు.