అధిక వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని రైతులకు, ప్రజలకు సూచించిన మాకినీడి శేషుకుమారి
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, రైతులు అధికవర్షాలకు అప్రమత్తంగా వుండాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి మాకినీడి శేషు కుమారి ఒక ప్రకటనలో సూచించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుచూ రైతులు, ప్రజలు అధైర్య చెందవద్దని, వారికి అండగా జనసేన ఉంటుందని, రైతులకు, ప్రజలకు కలిగిన లేదా కలుగబోవు నష్టాలకు నష్టపరిహారం యిచ్చులాగున జనసేన ప్రభుత్వం పై ఒత్తిడి చేసి వారికి న్యాయం చేయుట జరుగుతుందని తెలిపారు. నివర్ తుఫాన్ ప్రభావం వల్ల అన్ని చోట్ల తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను ఈ క్రింద తెలిపిన సూచనలు పాటించవలసినదిగా శేషుకుమారి రైతులను కోరారు. రైతులు వీలైనంత వరకూ వరి కోత తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఒక వేళ వరి కోతలు యంత్రాలు ఉపయోగించి మాత్రమే కోతలు కోసి వెంటనే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి టార్పాలిన్ లతో భద్ర పరుచుకోవాలని ఆమె కోరారు. ఎటువంటి పరిస్థితుల్లో మనుషుల చేత వరి కోత కోయించిరాదని, రైతన్నలు అందరూ ఈ మూడు రోజులు వరి కోత వాయిదా వేసుకోవాల్సిన తెలియచేశారు. అలాగే గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు, దూరంగా ఉండాలని మాకినీడి శేషుకుమారి ప్రజలను కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com