Logo
Date of Publish : 15 December 2022, 4:22 pm
Editor : Sake Naresh

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరును ఎండ గట్టిన మాకినీడి శేషుకుమారి

         పిఠాపురం ( జనస్వరం ) : ప్రస్తుతం వైసీపిపార్టీ విమర్శలే పనిగా మూడు సంవత్సరాలు కాలయాసన చేసి ప్రజాసమస్యలు మాత్రం గాలికి వదిలేసారని పిఠాపురం జనసేన ఇంచార్జ్ శేషుకుమారి అన్నారు. ఆమె మాట్లాడుతూ పాలన గాడి తప్పుతున్నా గాడిద గాండ్రింపులతో పాలావిధానం సాగుతుందని గాని ప్రజలకు ఒదిగేదిలేదని రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో అన్నారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎక్కడ కూడా డ్రైనేజీ, రోడ్లు, మంచి నీటి సదుపాయం గాని సరిగ్గా లేవని, ఇక్కడ ప్రజలు పట్టణ పరిదే అని మరచి పోయి సౌకర్యాలు లేని ఏజన్సీ ప్రాంతంలా బాధపడుతున్నారని ప్రజల ఇబ్బందులు స్పష్టతనిచ్చారు .ఏరుదాటాక చెప్పను వదిలేసి నట్లుగా ప్రజలతో ఓట్లు వేయించుకుని ప్రజలకు సౌకర్యాలు కల్పించక పోవడం దారుణమ్మన్నారు. ఒక్క చాన్స్ కార్యక్రమం ద్వారా జనసేనాకి బ్రహ్మరథం  పడుతున్నారని, జనసేన అధికారంలోకి వస్తే మొదట పని జగ్గయ్య చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద మాట్లాడానికి పిల్లి విమర్శలకు మాత్రం పులి ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గోపు సురేష్, బుర్రా సురేష్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, కంద సోమరాజు, వినయ్, మణికంఠ, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com