రాజులమ్మకు సఖి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించిన మాకినీడి శేషుకుమారి

మాకినీడి శేషుకుమారి

         పిఠాపురం ( జనస్వరం ) : చిత్రాడ గ్రామంలో సఖి లైన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. ముందుగా రాజులమ్మకు బట్టలు, రేషన్ సరుకులు, పండ్లు అందజేసి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న వృద్ధులకు భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి గారు మాట్లాడాతూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం చిత్రాడలో లైన్స్ క్లబ్ సఖి సభ్యులు సావిత్రి గారు వారి తల్లిదండ్రులు కోరుకు మేరకు వీరికి ఇక్కడ అన్నదానం చేయటం పేషెంట్ రాజులమ్మకు నిత్యావసర సరుకులు ఇవ్వటం సఖి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మా పిఠాపురం నియోజవర్గంలో మా జనసేన ఆధ్వర్యంలో చేయాలని కోరగా వెంటనే స్పందించి మన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆహారం ఇవ్వటం ఇప్పుడు చిత్రాడలో సేవ కార్యక్రమాలు చెయ్యటం జరిగింది. వీరందరికీ కూడా నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే రాజులమ్మ గతంలో నా హస్బెండ్ డాక్టర్ వీరప్రసాద్ గారు హైదరాబాదులో చికిత్స మా సమక్షంలో 3 ఆపరేషన్లు చేయించడం జరిగింది.  ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సమాజానికి సఖి క్లబ్ ద్వారా మహిళలు సేవ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖి ప్రెసిడెంట్ అరుణ కుమారి, లైన్స్ క్లబ్ ఆర్ సి సభ్యులు నాగలక్ష్మి, సావిత్రి,అమ్మాజీ, రమణి, జిల్లా జనసేన నాయకులు మొగలి అప్పారావు, చిత్రాడ జనసేన పార్టీ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, పుణ్యమంతుల మూర్తి, వార్డు నెంబర్ గొల్లపల్లి గంగ, బావిశెట్టి నంది, దేశి రెడ్డి సతీష్, తేలుదొర, నిమ్మనదుర్గబాబు, బస్వా గోపి, నంద్యాల జాను, నాయుడు మణికంఠ, దేవ, గనియ్య , కోటిపల్లి కాశి, దూలపల్లి అన్నవరం, పెంట వెంకటేష్, కుమార్, పెంకే జగదీష్ జన సైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way