
పిఠాపురం ( జనస్వరం ) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన బొంతు రమణ అనే గీత కార్మికుడుని పీడీ చట్టం క్రింద అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ అస్వస్థతకు గురైన రమణ కాకినాడ జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుని కుటుంబాన్ని పిఠాపురం నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పరామర్శించి, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుంది అని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇస్తానని ప్రకటించారో మాటమీద నిలబడి సకాలంలో అందించాలని కోరారు. సకాలం లో మృతుని కుటంబానికి న్యాయం జరగక పోతే జనసేన పార్టీ రమణ కుటుంబానికి అండగా నిలిచి పోరాటం చేస్తామని తెలియజేశారు.