పిఠాపురం ( జనస్వరం ) : ఈ నెల 14 వ తేదీన మచిలీపట్నంలో జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకూమరి పిలుపును ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శేషు కూమరి మాట్లాడుతూ ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, ఈ సభలో జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని ఆదేశించారు. అనంతరం జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని, పిఠాపురం నియోజవర్గం మూడు మండలాల నుండి భారీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, పార్టీ అభిమానులు భారీ ఎత్తున సభకు హాజరవడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో దిశా నిర్దేశం చేస్తారన్నారు. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని స్పష్టం చేశారు. అటు సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆరోపించారు. సభకు వెళ్లడం తమ హక్కు అని ప్రతి జనసేన కార్యకర్త చాటి చెప్పాలన్నారు. పోలీసులు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసిన వారికి సభాముఖంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, గోపు సురేష్, బుర్ర సూర్య ప్రకాష్, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, మేకల కృష్ణ, దొడ్డి దుర్గ ప్రసాద్, మోటురు మహేష్, మెరుగు ఇజ్రాయిల్, మేళం బాబీ, కసిరెడ్డీ నాగేశ్వరావు, పసుపులేటి దుర్గ ప్రసాద్, సురాడ శ్రీను, సత్తిరెడ్డి ఇస్సక్, వినుకొండ శిరీష, అమ్మజీ, పెనుమల్ల సత్యనందరెడ్డి, పెనుగొండ వెంకటేశ్వరరావు, జ్యోతుల గణేష్, కంద సోమరాజు పబ్బినీడి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com