పోలవరం ప్రాజెక్టు పై ప్రస్తుత పరిస్థితిపై ఖండించిన మాకినీడి శేషుకుమారి
రాజమండ్రి లో జరిగిన ప్రెస్ మీట్ లో పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితుల పై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తూర్పు గోదావరి ఇంచార్జ్ లు పోలవరం పై మాట్లాడటం జరిగింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడుతుంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే కేంద్రం తో పోరాడి పోలవరం పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అని తెలియజేయడం జరిగింది. ఓట్ల రాజకీయాలు కాకుండా ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించి మీరు ఇప్పటి నుండి అయినా సరే అయిన పరిపాలన అందించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అన్ని నియోజకవర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం లో పి ఏ సి సభ్యులు పంతం నానాజీ గారు, పితాని బాలకృష్ణ గారు, శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు, DMR శేఖర్ గారు, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు గారు,వేగుళ్ల లీలా కృష్ణ గారు, తుమ్మల బాబు గారు,అత్తి సత్య నారాయణగారు, పాఠంశెట్టి సూర్య చంద్ర గారు, తదితరులు పాల్గొన్నారు.