Logo
Date of Publish : 24 September 2020, 3:07 pm
Editor : Sake Naresh

నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన మాకినీడి శేషకుమారి

నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన మాకినీడి శేషకుమారి

             పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సూరంపేట కు సరైన దారి మార్గం మంచి నీటివసతి, కరెంట్ సమస్యలు, నెరవేర్చమని కోరటం జరిగింది. సూరంపేట ప్రజలు దశాబ్దాల నుండి వర్షాకాలంలో సరైన దారి మార్గం లేక తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు.  వర్షాకాలంలో ఏలేరు, సుద్దగడ్డ ఉదృతంగా ప్రవహించినప్పుడు వీరికున్న మార్గం ముంపునకు గురై పీకల్లోతు నీరు ప్రవహిస్తుంది ఇటు వంటి సమస్యల్లో గొల్లప్రోలుకి సూరంపేటకి రాకపోకలు స్తంభించిపోతునాయి. వర్షాకాలం పూర్తి అయ్యేవరకు కూడా తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. కావున ఈ సమస్య తీవ్రంగా పరిగణించి తగిన పరిష్కారం చూపమని అలాగే గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లోని ముంపుకు గురైన పంట నష్టపరిహారం ఏర్పాటు చేయాలని కోరడం, గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లోని ఏలేరు సొంత గడ్డ వరద తాకిడికి తీవ్ర ముప్పు కు గురైన నెల రోజుల్లో పంట చేతికందుతుంది. అనుకున్న రైతుకు నిరాశ మిగిలిన వరద నుండి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఇప్పటికే రైతులు పంటకు సుమారు 30 వేలు ఖర్చు పెట్టి ఉన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని,రైతులను ఆదుకుంటారాని లెటర్ లో సమస్యలు ప్రవస్తావించి వినతిపత్రాన్నీ గౌరవమైన మండల రెవెన్యూ అధికారి వాకాడ అమ్మాజీ గారికి (గొల్లప్రోలు లో ) పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీ మాకినీడి శేషు కుమారి గారు అందచేశారు. ఈ కార్యక్రమంలో మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, k.రఘు, s.స్వరూప్, కోలా ప్రసాద్, వై. శ్రీనివాస్ , బిజెపి నాయకులు జనసైనికులు సూరంపేట గ్రామస్తులు పాల్గొన్నారు. 

          గొల్లప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మంత్రి కొడాలి నాని పై కేసు పెట్టారు. ఎస్ ఐ గారిని వెంటనే కేసు నమోదు చేయాలని సెక్షన్ 295, 295A, 153A కింద కేసు నమోదు చేయాలని అరెస్ట్ చేయాలని బిజెపి నాయకులు జనసేన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారు బిజెపి నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com