
పొన్నలూరు, (జనస్వరం) : జనవరి 12న శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో జరుగుతున్నటువంటి యువశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం, యువతకు దిశా నిర్దేశం ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని, అదేవిధంగా భారతదేశంలోనే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, యువత గురించి ఆలోచిస్తున్నా ఏకైక రాజకీయ పార్టీ జనసేనపార్టీ మాత్రమే. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కేవలం జనసేన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.